మూడు నెలల్లో పంట కోత - స్వల్పకాలిక పంటలు
వ్యవసాయం నుండి అధిక లాభాలు పొందడానికి, ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేకుండా , వర్షాకాలం వ్యవసాయం కోసం మీరు పంట నాటుకొని 3 నెలల్లోనే దిగుబడిని పొందవచ్చు, అంటే విత్తనాలు విత్తినప్పటి నుండి అవి అమ్మకానికి అందుబాటులోకి వచ్చే వరకు కేవలం 90 రోజులు మాత్రమే పడుతుంది. రైతులు మరియు అగ్రిబిజినెస్‌లు పెట్టుబడిని పెట్టి ఏడాదికి అనేక సార్లు సాగు చేయడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చును. ఈ పంటలు మీకు తక్కువ సమయంలో ఎక్కువ నగదును అందిస్తాయి మరియు ఎక్కువ సమయం పంటలు సాగుభూమిలో వెచ్చిస్తే చీడపీడల ప్రమాదం ఎక్కువ కాబట్టి స్వల్పకాలిక పంటలలో ఈ ప్రమాదం తక్కువగా ఉంటుంది.
ఈ క్రింది పంటలను పండించుకొని మీరు మూడు నెలల్లో దిగుబడిని పొందవచ్చును
టమాట
విత్తన రకాలు : పి.కే.ఎం -1 , అర్క వికాస్ , అర్క సౌరభ్, మారుతం
భారతదేశం లో ఎక్కువగా పండించే కూరగాయ పంటలలో టమాట ఒకటి. టమాటా సాగు లాభదాయకమైనది మరియు ఎక్కువ దిగుబడులను అందిస్తుంది. పంటకు ఎల్లప్పుడూ తగిన తేమ అందించడానికి నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేయాలి, అయితే ఈ పంట రబీలో 12-16 టన్నులు మరియు వేసవిలో 8-10 టన్నుల దిగుబడి ఎకరాకు అందిస్తుంది.
బెండకాయ
విత్తన రకాలు : పంజాబ్ పద్మిని, పర్భానీ క్రాంతి, తులసి 7109
బెండకాయ చాలా లాభదాయకమైన కూరగాయల రకం. ఇది 40 రోజులలో పరిపక్వతకు చేరుకుంటుంది. కాబట్టి, మీరు నాటిన 35వ రోజు నుండి పెట్టుబడిపై భారీ రాబడితో పంటను ప్రారంభించవచ్చు. మీరు ఒక బెండకాయ విత్తనం నుండి వంద బెండకాయ విత్తనాలను పండించవచ్చు. రైతులు విత్తనాలు లేదా తాజా కూరగాయలు విక్రయించవచ్చు. తాజా బెండకాయలు దాదాపు 4 రోజుల పాటు నిల్వ ఉంటాయి.
పుచ్చకాయ
విత్తన రకాలు :షుగర్ బేబీ, అర్క జ్యోతి, అర్క మాణిక్, దుర్గాపూర్ కేసరి, దుర్గాపూర్ మీట
పుచ్చకాయ సగటు పంట కాలం 75 రోజులు. పుచ్చకాయను ఎండాకాలం లో ఎక్కువగా సాగు చేస్తారు. తగినంత నీటి సరఫరా అందించి, అవసరమైన ఎరువులు మరియు వ్యవసాయ పద్ధతులను పాటించడం వలన ఎక్కువ దిగుబడులను పొందవచ్చును. హెక్టారుకు 2 టన్నుల దిగుబడి వస్తుంది..
దోసకాయ
విత్తన రకాలు :ఆర్. ఎం. ఎస్. ఎం -1 , ఆర్. ఎం. ఎస్. ఎం -౩
దోసకాయ నాటిన 3 నెలల్లో అధిక దిగుబడులను అందిస్తుంది. ఈ పంటతో తక్కువ సమయంలో భారీ లాభాలను పొందవచ్చును. వ్యవసాయ భూమి పరిమాణాన్ని బట్టి పంటకోత ప్రారంభించిన తర్వాత, కోత పూర్తి చేయడానికి మీకు 2 నెలల సమయం పట్టవచ్చు.
క్యాబేజి
విత్తన రకాలు :గోల్డెన్ ఏర్ , ఎర్లీ డ్రం హెడ్ , మహికో మరియు ఇండోఅమెరికన్ రకాలు
100 రోజుల్లో భారీ లాభాలను పొందగలిగే అత్యంత లాభదాయకమైన పంటలలో క్యాబేజి ఒకటి. క్యాబేజీకి చల్లని తేమగల వాతావరణం అత్యంత అవసరం, పగటి గరిష్ట ఉష్ణోగ్రత ౩౦ సెల్సియస్ మించకుండా ఉంటే ఎక్కువ దిగుబడిని అందిస్తుంది.క్యాబేజి ఒక హెక్టారుకు 100 టన్నుల దిగుబడిని ఇస్తుంది.
మొక్కజొన్న
విత్తన రకాలు : పొయినీర్ ౩౩, పొయినీర్ 42, జె. కే.ఎం. హెచ్ 1701, డ్.హ్.ఎం 117, కరీంనగర్ మక్క
మొక్కజొన్న ను ఖరీఫ్ మరియు రబీ కాలం లో ఎక్కువగా సాగు చేస్తారు. ఆచరణీయమైన మొక్కజొన్న విత్తనాలను స్వీకరించడానికి మీ భూమిని తగిన సమయంలో సరిగ్గా సిద్ధం చేసుకోవాలి. తగిన దిగుబడులను పొందడానికి మీ ప్రాంతంలో సిఫార్సు చేయబడిన రకాలను సాగు చేయాలి. విత్తనాలు విత్తుకునేటప్పుడు 60X20 సెంటీ మీటర్లు విత్తు దూరాన్ని పాటించాలి.
వంగ
విత్తన రకాలు : పూస క్రాంతి, మహికో రావయ్యా, మహికో హైబ్రిడ్ నెంబర్.1, మహికో హైబ్రిడ్ నెంబర్.3, పూస పర్పుల్
వంగ ఉష్ణమండలపు పంట.అధిక ఉష్ణోగ్రతలను, నీటి ఎద్దడిని చాలావరకు తట్టుకోగలదు, కొండ ప్రాంతాల్లో,చల్లటి వాతావరణంలో మొక్క పెరుగుదల తగ్గుతుంది. నాటిన 50-60 రోజులకు మొదటి కోత వస్తుంది లేత కాయల కోసం ప్రతి 3 రోజుల కొకసారి కోత కోయాలి.
ఈ విధంగా పైన వివరించిన పంటలలో ఏ ఒక్క పంట వేసుకున్న రైతులు అధిక లాభాలను పొందవచ్చును, అదే విధంగా మీ పంటలలో ఎమన్నా చీడ పీడలు ఆశించినట్టైతే జైహోకిసాన్ టోల్ ఫ్రీ నంబరును సంప్రదించగలరు.
వివిధ పంటల గురించి మరింత సమాచారం కోసం జై హో కిసాన్ మొబైల్ ఆప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి. జై హో కిసాన్ అనేది రైతు ముఖంలో చిరునవ్వును పండించడానికి ఉద్దేశించిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్, తద్వారా పంట సలహా, రోజువారీ మార్కెట్ ధరలు, రుణాలు మరియు పథకాలపై సమాచారం మరియు మరెన్నో సేవలను అందిస్తుంది.